ఎట్టకేలకు పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నాడు. అందుకు రంగం వేగవంతంగా సిద్ధం అవుతోంది. నవంబరు 15న పవన్ కొత్త సినిమా ప్రారంభం కానునన్నట్టు టాలీవుడ్ తాజా సమాచారం. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తారు. ఏ.ఎం.రత్నం నిర్మాత. ఇది వరకే క్రిష్.. పవన్‌కి ఓ కథ చెప్పాడు. అది పవన్‌కి బాగా నచ్చింది. దాంతో ఈ సినిమాకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. స్క్రిప్టు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వడంతో షూటింగ్ కూడా మొదలెట్టేయనున్నారు.
నవంబరు 15న లాంఛనంగా ప్రారంభించి, డిసెంబరులో షూటింగ్ మొదలెట్టాలని ప్లాన్. చాలా త్వరత్వరగా సినిమా పూర్తి చేస్తారన్న విషయంలో క్రిష్‌కి మంచి పేరుంది. ఈ సినిమాకీ క్రిష్ చాలా వేగంగా ముగించాలని చూస్తున్నాడు. ఎందుకంటే పవన్ చేతిలో `పింక్` రీమేక్ కూడా ఉంది. క్రిష్‌తో సినిమా చేస్తూనే, పింక్ రీమేక్ పూర్తి చేయాలన్నది పవన్ ఆలోచన. కాని పక్షంలో క్రిష్ సినిమా త్వరగా ముగించి, పింక్ రీమేక్ కి డేట్లు ఇవ్వాలని చూస్తున్నారు. అంటే ఏకకాలంలో పవన్ రెండు సినిమాలు పూర్తి చేయబోతున్నాడన్నమాట.