వరుస ఫ్లాపులతో రవితేజ కెరీర్ బాగా డీలా పడిపోయింది. అయితే చేతిలో సినిమాలకైతే కొదవ లేదు. ఓ పక్క డిస్కోరాజా చేస్తూనే గోపీచంద్ మలినేని సినిమా ఒప్పేసుకున్నాడు. శ్రుతిహసన్ కథానాయికగా నటించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ సినిమాకు క్రాక్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాకి గానూ రవితేజ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట. సినిమా పూర్తయి, బిజినెస్వ్యవహారాలు ముగిశాకే డబ్బులు ఇమ్మంటున్నాడట. రవితేజ ఫ్లాపుల ప్రభావం బిజినెస్ పై పడింది. రవితేజ సినిమా అంటే ఇది వరకు ఎగబడే బయ్యర్లు సైతం ఇప్పుడు కామ్‌గా ఉంటున్నారు. అందుకే.... రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రవితేజకు బయ్యర్లు లేకపోయినా శాటిలైట్, డిజిటర్ రైట్స్రూపేణా దాదాపు 15 కోట్ల వరకూ గిట్టుబాటు అవుతుంది. 20 కోట్లతో సినిమా పూర్తి చేసుకుంటే నిర్మాత లాభాలు చూడొచ్చు. అందుకే రవితేజ ఈ రూటు ఎంచుకున్నాడు. డబ్బులు తీసుకోకుండా, ఆ స్థానంలో లాభాల్లో వాటా దక్కించుకుంటాడన్నమాట.