పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఏఎంరత్నం నిర్మాత. ఇటీవల హైదరాబాద్‌లో కొంతమేర షూటింగ్ జరిగింది. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కోసం క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఏంటన్నది ఇప్పటి వరకూ చెప్పలేదు. `విరూపాక్ష` అనే టైటిల్ ఈ సినిమా కోసం చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈమధ్యే `హర హర వీరమల్లు` అనే మరో పేరు కూడా బయటకు వచ్చింది.
ఈ రెండింటిలో ఏది ఖరారు చేస్తారన్న విషయంలో సస్పెన్స్ మొదలైంది. అయితే.. చివరికి `హరి హర వీరమల్లు` అనే పేరే ఖాయం చేసినట్టు సమాచారం. ఓ మంచి రోజు చూసుకుని ఈ టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. అంతే..కాదు. ఇప్పటి వరకూ ఈ సినిమాలోని పవన్ లుక్ ని రివీల్ చేయలేదు. ఇప్పుడు టైటిల్ తో పాటు లుక్ నీ బయటకు తీసుకురావాలనుకుంటున్నారు.
2022 సంక్రాంతి కి ఈ సినిమా విడుదల చేసే అవకాశాలున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. అందుకోసం క్రిష్ భారీగానే ఖర్చు పెట్టబోతున్నాడు. కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ దొంగగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.