పవన్‌ న్యూ స్టైల్‌ కథేంటో!

మరిన్ని వార్తలు

పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో కొత్త సినిమా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమా కోసం పవన్‌కళ్యాణ్‌ కొత్త స్టైలింగ్‌ని సంతరించుకోనున్నాడట. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమాలో పోలీస్‌ గెటప్‌, 'కాటమరాయుడు'లో పంచె గెటప్‌తో నార్మల్‌గా కనిపించిన పవన్‌, త్రివిక్రమ్‌ సినిమా కోసం మాత్రం ట్రెండీ లుక్‌ని ట్రై చెయ్యనున్నాడని సమాచారమ్‌. దీనికోసం త్రివిక్రమ్‌ కొన్ని స్కెచెస్‌ కూడా పవన్‌కి చూపించాడని తెలియవస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'జల్సా' హిట్‌, 'అత్తారింటికి దారేది' బంపర్‌ హిట్‌. ఈ మూడో సినిమా సెన్సేషన్‌ హిట్‌ అవనుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకే ఈ సినిమా కోసం అన్ని విషయాల్లోనూ చాలా కొత్తగా ఉండేలా పవన్‌ ట్రై చేస్తున్నాడనీ సమాచారమ్‌. ఇంతవరకూ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాల్లోనూ పవన్‌ లుక్‌ వెరీ వెరీ స్టైలిష్‌గా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో మరింత కొత్తగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరక్కెబోతోంది. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటించనున్నారు. అంతేకాదు త్రివిక్రమ్‌ సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్స్‌కీ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్‌కి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వనున్నాడో త్రివిక్రమ్‌ చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS