సినిమాలు చేయననీ, తన జీవితం ప్రజా జీవితానికే అంకితమని గతంలోనే పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు. కానీ ఫ్యాన్స్ అలా కోరుకోవడం లేదు. రాజకీయాలతో పాటు, సినిమాల్లో కూడా మరి కొంత కాలం పవన్ కళ్యాణ్ రాణించాలని కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే కోరుకున్నారు. రెండు పడవల ప్రయాణం పవన్‌కి పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. తాజాగా జనసేన పార్టీ నేతలు కూడా అదే కోరుకుంటున్నారట.
ఆయన సినిమాల్లో నటించడం పార్టీకి అదనపు లాభం చేకూర్చుతుందని భావిస్తున్నారట. యూత్‌లో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్, సినిమాల్లో నటిస్తే, యూత్ మరింత యాక్టివ్ అవుతారనీ తద్వారా అది పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనీ వారు భావిస్తున్నారట. పవన్‌కి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ కూడా ఇదే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌ని కలిశారనీ, తమ కాంబోలో సినిమాకి చర్చించేందుకే హరీష్, పవన్ కళ్యాణ్‌ని కలిశారనీ ప్రచారం జరిగింది.
కానీ సినిమా విషయమై పవన్‌తో భేటీ అయిన విషయం అబద్దమనీ, హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు. కానీ పవన్ ఒప్పుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఛాన్స్ వదులుకోనని హరీష్ శంకర్ చెప్పారు. ఈ క్షణం పవన్ సినిమాకి సై అంటే బడ్జెట్‌కి వెనుకాడకుండా, సినిమా రూపొందించేందుకు ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరితో సహా పలువురు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇన్ని రకాల ప్రపోజల్స్ ఉండడంతో ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫైనల్‌గా తన నిర్ణయాన్ని బయట పెట్టనున్నారట. చూడాలి మరి, సినిమాలపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!