‘గబ్బర్‌ సింగ్‌’ కాంబో.. హీరోయిన్‌ ఎవరు?

మరిన్ని వార్తలు

‘గబ్బర్‌సింగ్‌’ కాంబినేషన్‌ రిపీట్‌ అవబోతోంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమాని అనౌన్స్‌ చేసిన విషయం విదితమే. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ పేరుని ఖరారు చేశారు. అయితే, హీరోయిన్‌ ఎవరు.? ఈ ప్రశ్నకి సమాధానంగా కొందరు కాజల్‌ అగర్వాల్‌ పేరుని ప్రస్తావిస్తున్నారు. మరికొందరు, బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ పేరు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే హీరోయిన్‌ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన విషయం విదితమే.

 

కథ విషయంలో పూర్తి క్లారిటీతో వున్నామనీ, అన్ని వివరాలూ త్వనలోనే ప్రకటిస్తామనీ హరీష్‌ శంకర్‌ చెప్పుకొచ్చాడు కూడా. అయితే, ఈలోగా గాసిప్స్‌ ఆగుతాయా.? దాదాపు ఓ డజను మంది హీరోయిన్ల పేర్లను తెరపైకి తెచ్చేసి, గాసిప్స్‌ నింపేస్తున్నారంతా. నిజానికి, నిప్పు లేకుండా పొగ రాదు. కానీ, సినీ పరిశ్రమలో మాత్రం నిప్పు లేకుండానే పొగ వచ్చేస్తుంటుంది. ఒక్కోసారి అలా వచ్చే గాసిప్స్‌ తాలూకు ఇంపాక్ట్‌తో కొన్ని కాంబినేషన్స్‌ అనూహ్యంగా సెట్‌ అయిపోతుంటాయి.

 

ఇప్పుడు ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. ఏ పెద్ద హీరోకి సంబంధించిన సినిమా అప్‌డేట్‌ వచ్చినా, దానికి పాన్‌-ఇండియా లింక్‌ కలిపేస్తున్నారు. ఆ లెక్కన పవన్‌ - హరీష్‌ కాంబోలో వచ్చే సినిమాకి కూడా ఆ స్థాయి వుంటుంది కదా.! సో, దాన్ని దృష్టిలో పెట్టుకునే హీరోయిన్‌ పేరు ఖరారు చేస్తారేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS