రకుల్ టాలీవుడ్లో అడుగుపెట్టి ఆరేళ్లయిపోయింది. ఈ ఆరేళ్లలో రకుల్ ఎత్తుపల్లాలు చాలా చూసింది. అయితే ఇప్పటికీ తను టాప్ రేసులోనే ఉంది. స్టార్ హీరోలో చేస్తూనే, యువ కథానాయకులతోనూ జట్టు కడుతోంది. అయితే ఇప్పటి వరకూ నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలేవీ చేయలేదు. ఆ ఆలోచన ఎందుకు రాలేదు? అని అడిగితే విచిత్రమైన సమాధానం ఇచ్చింది. ''అలాంటి కథలు చాలానే విన్నాను. అయితే... వాటిని మోసేంత అనుభవం నాకు లేదని తెలిసింది.
అంతేకాదు.. పాటలు, గ్లామర్ పాత్రలపై నాకింకా మోజు తీరలేదు. వాటిని ఆస్వాదిస్తూనే ఉన్నా. అలాంటప్పుడు సడన్ గా ఈ రూటు వదిలేసి మరో దానిపై ఎందుకు దృష్టి పెట్టాలి? నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేయాలి అనుకుంటే.. ఎప్పుడైనా చేసేస్తా. అందుకు పెద్ద సమయం ఏమీ తీసుకోను'' అని క్లారిటీ ఇచ్చింది రకుల్. ప్రస్తుతం `మన్మథుడు 2`లో నటిస్తోంది. తను కథానాయికగా నటించిన `ఎన్జీకే` ఈనెల 31న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.