'పింక్' తెలుగు రీమేక్‌లో పవన్‌ని నటింపచేయడానికి సర్వ ప్రయత్నాలూ చేస్తున్నాడు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. ఈ సినిమాకి సంబంధించి అన్నీ సిద్ధం చేసేశారాయన. ఇక పవన్ ఊ అంటే పట్టాలెక్కడమే తరువాయి. హీరోయిన్‌గా పూజా హెగ్దేనీ, డైరెక్టర్‌గా వేణు శ్రీరామ్‌నీ కూడా రెడీ చేసేశాడు. కానీ, పవన్ ఏమో నిర్మాతగా అయితే ఓకే కానీ, నటనకు నో అని చెబుతున్నారు కానీ, పవన్ నటించక తప్పదేమో అనిపిస్తోంది. నిజానికి 'పింక్' సినిమాలో పవన్ పాత్రకు పెద్దగా డేట్స్ కేటాయించాల్సిన అవసరం లేదు.
మహిళలపై జరిగే అకృత్యాలు, అన్యాయాలకు సంబంధించిన సినిమా ఇది. హీరోయిన్ పాత్రకే ఎక్కువ స్పేస్ ఉంటుంది ఈ సినిమాలో. అంటే పూజా హెగ్దే క్యారెక్టర్‌కే ఎక్కువ వేల్యూ ఉండనుంది. ఈ పాత్రను హిందీలో తాప్సీ నటించింది. అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఆ పాత్రకు బిగ్‌బీనే చాలా తక్కువ డేట్లు ఇచ్చారట. అలాగే పవన్ కళ్యాణ్‌ని కూడా ఎలాగోలా ఒప్పించి రెండు మూడు రోజులైనా డేట్స్ కన్‌ఫామ్ చేయించేస్తారు బోనీ కపూర్ అని అంటున్నారు.
అంటే, పవన్ రీ ఎంట్రీ కన్‌ఫామే అని చెప్పొచ్చు. అయితే, ఇదివరకటిలా హీరోయిన్స్‌తో రొమాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేం. ప్రస్తుతం రాజకీయాల కోసం బహిరంగ వేదికలపై ఎలా రియల్ స్పీచ్‌లు ఇస్తున్నాడో, అలాగే కోర్టులో ఓ బలమైన కేసు వాదించే లాయర్ పాత్రలో రీల్ స్పీచ్ ఇస్తూ కనిపిస్తాడు. అంతే డిఫరెన్స్. సో పెద్దగా ఇబ్బంది లేని పాత్రే ఇది. అందుకే బోనీ కపూర్ అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. చూడాలి మరి, ఏం జరుగుతుందో.