పవన్ కల్యాణ్ రీ ఎంట్రీకి సంబంధించి ఎన్నో వార్తలు. దర్శకులుగా చాలామంది పేర్లు. కానీ పవన్ మాత్రం ఇప్పటి వరకూ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయితే ఇద్దరు దర్శకులు మాత్రం పవన్ సినిమాపై భరోసాగా పనిచేస్తున్నారు. వాళ్లే క్రిష్, వేణు శ్రీరామ్. క్రిష్ పవన్ కోసం ఓ జానపద కథ సిద్ధం చేశాడు. పింక్ రీమేక్‌లో తలమునకలై ఉన్నాడు వేణు. అయితే పవన్ మాత్రం ఈ రెండింటిలో ఒక సినిమానే చేయగలడట.
రెండు సినిమాలూ చేయడానికి పవన్ సిద్ధమైనా, రాజకీయ కారణాల వల్ల ఒక్క సినిమానే చేసే అవకాశం ఉందని, ఈ రెండు కథల్లో దేనికి ఓకే చెప్పాలో పవన్‌కి అర్థం అవ్వడం లేదని తెలుస్తోంది. పవన్ నిర్ణయం కోసం అటు క్రిష్, ఇటు వేణు ఇద్దరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరి సినిమా ఓకే చేసినా సరే...అది ఫిబ్రవరిలోనే మొదలవుతుందట. డిసెంబరు లేదా జనవరిలో లాంఛనంగా సినిమా మొదలెట్టి, ఫిబ్రవరిలో షూటింగ్ మొదలెట్టి, దసరాకి విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.