గ్యాంగ్‌లీడర్‌లో నాని రచయితగా కనిపించాడు. హాలీవుడ్ సినిమాలు చూసి, అందులో ఉన్న కథనీ, పాత్రల్నీ కాపీ కొట్టే పెన్సిల్‌గా కనిపించాడు.. నవ్వించాడు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కూడా అదే చేస్తున్నాడు. తన కొత్త సినిమాలో ఓ రైటర్‌గా కనిపించబోతున్నాడు. తేజూ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సోలో బతుకే సో బెటరు`. సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. నభా నటేషా కథానాయిక.
ఇందులో తేజూ ఓ పుస్తకం రాస్తాడట. వివాహ వ్యవస్థను విమర్శిస్తూ, బ్రహ్మచారిగా ఉండిపోవడమే బెటర్ అని చెబుతూ రాసిన ఆ పుస్తకం చూసి, నభా నటేషా తేజూని అభిమానిగా మారిపోతుందట. అక్కడి నుంచి ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుందని తెలుస్తోంది. మన్మథుడు సినిమా ఛాయలు అక్కడక్కడ కనిపించినా - కథని పూర్తిగా వినోదాత్మకంగా మలుస్తున్నాడట సుబ్బు. మొత్తానికి హీరో పాత్ర, అతని చుట్టూ నడిచే సన్నివేశాఉల కావల్సినంత వినోదాన్ని పంచిస్తాయని చిత్రబృందం చెబుతోంది. మరి రచయిత పాత్రలో తేజూ ఎంత కామెడీ చేస్తాడో చూడాలి.