పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలవైపు రావడం ఖాయమైపోయింది. పవన్ సినిమాలు చేయడానికి పచ్చ జెండా ఊపేయడంతో నిర్మాతలు, దర్శకులు పవన్ ముందు క్యూ కడుతున్నారు. క్రిష్ చెప్పిన కథకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, దానికి ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది. రత్నంతో పవన్ ఎప్పుడో సినిమా చేయాల్సివుంది. పైగా అడ్వాన్సు కూడా తీసుకున్నాడు. అందుకే రత్నం సినిమా ఖాయమైపోయినట్టే అనుకుంటున్నారు.
అయితే అంతకు ముందే పవన్ `పింక్` రీమేక్‌లో నటిస్తానని మాటిచ్చాడట. దీనికి దిల్ రాజు నిర్మాత. ఓ దర్శకుడ్ని చూసి, తనతో తెలుగులో ఈ స్క్రిప్టుని రాయిస్తున్నార్ట. ఆ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని తెలుస్తోంది. పింక్ రీమేక్ పూర్తయ్యాకే పవన్ క్రిష్ సినిమాని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. పింక్ రీమేక్ చేయాల్సివస్తే పవన్ కేవలం 30 రోజుల కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది. సినిమా కూడా త్వరగా పూర్తవుతుంది. అందుకే పవన్ పింక్ రీమేక్‌పై మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం.