ఈ ఇయర్ ఎండింగ్ టాలీవుడ్లో ఇంతకు ముందెన్నడూ లేని క్యూరియాసిటీ నెలకొంది. రికార్డు స్థాయిలో ఇయర్ ఎండింగ్ సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. నిజానికి సంక్రాంతి రేస్ పెద్దగా ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది సంక్రాంతిని సూపర్ స్టార్ మహేష్‌బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ తప్ప ఇంకెవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అందరి దృష్టి ఎక్కువగా డిశంబర్ పైనే పడింది.
నితిన్, సాయి ధరమ్ తేజ్ వంటి యంగ్ హీరోస్తో పాటు రవితేజ వంటి స్టార్ హీరో, బాలయ్య, వెంకటేష్ వంటి అగ్రహీరోలు కూడా డిశంబర్ కోసమే పోటీ పడడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నితిన్ 'భీష్మ' చిత్రం డిశంబర్‌లో విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. తేజు 'ప్రతిరోజూ పండగే' సినిమాతో డిశంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక రవితేజ 'డిస్కోరాజా'తో ఈ సారి క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాడు.
వీటితో పాటే, మేం కూడా సంక్రాంతిని కాదు, క్రిస్మస్‌నే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అన్నట్లుగా, వెంకటేష్ 'వెంకీ మామ'తోనూ బాలయ్య 'రూలర్' (వర్కింగ్ టైటిల్)తోనూ రెడీ అయిపోతున్నారు. సో ఈ ఏడాది ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డిశంబర్ భారీ అంచనాల్ని క్రియేట్ చేస్తోంది. అయితే, వీటిలో ఏ సినిమా కూడా ఇంతవరకూ ఫిక్స్డ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. కానీ, కారణమేంటో తెలీదు కానీ, అందరి దృష్టీ డిశంబర్ పైనే ఉండడం మాత్రం విశేషం.