నా మొగుడుంటే నాక్కూడా ఆ ప్లేస్ ఇచ్చేసేవాడు.. అంటూ నిన్న, మొన్నటి ఎపిసోడ్స్‌లో వరుణ్ - వితికల మీద టాపర్ ఆఫ్ ది హౌస్ టాస్క్‌కి సంబంధించి గొడవకు దిగిన శివజ్యోతి కారణంగా ఇంటి సభ్యులు మొత్తం ఈ వారం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బిగ్‌బాస్ హోటల్ టాస్క్ హౌస్‌లో రన్ అవుతోంది. హౌస్మేట్స్ ఈ టాస్క్‌లో ఉండగానే, కుటుంబ సభ్యుల్ని హౌస్‌లోకి పంపించాడు బిగ్‌బాస్. ఆ క్రమంలో జ్యోతక్క భర్త గంగూలీ ఇంట్లోకి ప్రవేశించారు.
ఆ సమయంలో జ్యోతక్క ప్రీజింగ్ డ్రిల్‌లో ఉంది. గంగూలీని చూడగానే డ్యామ్‌కి కట్టలు తెగాయి. బిగ్ హౌస్ మొత్తాన్నీ 'కన్నీటి'తో ముంచేసింది. ఇక గంగూలీతో శివజ్యోతి చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. చాలానే చేసింది. ఈ ఎపిసోడ్ చూసిన నెటిజన్లు శివజ్యోతిని విమర్శలతో ముంచెత్తేశారు. ఇక గంగూలీ హౌస్ విడిచి పెట్టి వెళ్లిన తర్వాత అలీతో శివజ్యోతి డిస్కషన్ స్టార్ట్ చేసింది.
'నేను లేకున్నా, గంగూలీ బాగానే ఉన్నాడు.. అస్సలు నన్ను మిస్ కావడం లేదు.. నాకెందుకో అనుమానం వస్తోంది..' అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది. అంతేకాదు, భర్తతో నేనేం తప్పు చేయలేదు అని చెప్పడాన్ని కూడా నెటిజన్లు అనుమానిస్తున్నారు. ఇంతవరకూ మంచి అమ్మాయి అని పేరు తెచ్చుకున్న శివజ్యోతి చివరికి వచ్చేసరికి తన క్యారెక్టర్ని పూర్తిగా బ్యాడ్ చేసుకుంటోందంటూ నెటిజన్లు విస్తుపోతున్నారు.