'పింక్‌' రీమేక్‌లో పవన్‌ ఎంట్రీ షురూ అయ్యిందోచ్‌!

By Inkmantra - January 17, 2020 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ 'పింక్‌' మూవీని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌తో కలిసి దిల్‌ రాజు ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ జరగనుందని పవన్‌ ఫ్యాన్స్‌ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ ఆశలకు చిగురులు తొడిగినట్లే. ఈ నెల 20 నుండి పవన్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారట. పవన్‌పై ఓ పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ సీన్‌ని షూట్‌ చేయనున్నారట. అందుకోసం చిత్ర యూనిట్‌ భారీ సన్నాహాలు చేస్తోందట. భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసి, పవన్‌ని ఈ సినిమాలో నటింపచేస్తున్నారు దిల్‌రాజు అండ్‌ టీమ్‌.

 

చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ డేట్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ టైమ్‌లోగానే పవన్‌ షూటింగ్‌ పూర్తి చేయనున్నారట. తమపై జరిగిన అరాచకాన్ని ఎదిరించి పోరాడుతున్న ముగ్గురు అమ్మాయిలకు అండగా నిలబడే ఓ పవర్‌ ఫుల్‌ లాయర్‌ పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్నారు ఈ సినిమాలో. ఒరిజినల్‌లో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన పాత్ర అది. అంజలి, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌ విషయమై ఇంకా సస్పెన్స్‌ నెలకొని ఉంది. త్వరలోనే ఆ విషయం పైనా క్లారిటీ రానుంది. యంగ్‌ డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS