విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మకీ, నేచురల్ స్టార్ నానికీ మధ్య చిన్న కమర్షియల్ డిఫరెన్సెస్ ఉన్నాయనే టాపిక్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ వీరిద్దరి మధ్యా ఏం జరిగిందంటా.? అసలు ప్రశాంత్ వర్మని డైరెక్టర్‌గా పరిచయం చేసిన ఘనత నానిదే. షార్ట్ ఫిలింస్ ద్వారా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ, ఓ విలక్షణ కథతో నానిని సంప్రదించగా, కథ నచ్చిన నాని తానే నిర్మాతగా మారి, వాల్ పోస్టర్ బ్యానర్‌ని స్థాపించి ‘అ.!’ చిత్రాన్ని రూపొందించాడు. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిదొక్కుకోలేకపోయినా, మేకప్ తదితర కొన్ని కేటగిరీస్‌లో జాతీయ అవార్డు దక్కించుకుంది. ఇదంతా పాత కథే.
కొత్త కథేంటంటే, ఈ సినిమాకి సీక్వెల్.. అంటూ కొత్త న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అదేదో నటీ నటులు, న్యూస్ రీడర్లూ కావలెను.. అని ప్రకటన ఇచ్చినట్లుగా, నా సినిమాకి మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలు కావాలి.. అంటూ ట్వీట్ చేయడం కొందర్ని విస్మయానికి గురి చేస్తోంది. టేస్ట్ ఉంది కాబట్టే కదా.. కథ వినగానే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుని ఈ సినిమా కార్య రూపం దాల్చేందుకు కారణమయ్యాడు నాని. అలాంటిది, సీక్వెల్‌లో విషయం అంత బాగా ఉంటే, ప్రాఫిట్ ఆలోచించకుండా ఆయనే మళ్లీ రంగంలోకి దూకేవాడు కదా.. అలాంటిది ప్రశాంత్ వర్మ చేస్తున్న ఈ ప్రచారంలో అర్ధముందా.? ఒకవేళ నానిని మెప్పించేలా ప్రశాంత్ సీక్వెల్ కథ లేదేమో అని కొందరు అభిప్రాయపడుతుండగా, లేదు.. లేదు.. ‘అ.!’ టైమ్‌లోనే నానికీ, వర్మకీ చెడిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంకొందరు. ఇంతకీ వీరిద్దరికీ ఎక్కడ చెడిరదనేది మాత్రం అర్ధం కాని ప్రశ్న.