పవన్ అభిమానులకు ఇది శుభవార్త. పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రిందట కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. తాజా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటీవ్ అని తేలింది. ఆయన ఆరోగ్యం క్షేమంగా ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని... జనసేన పార్టీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. తన కోసం ప్రార్థనలు చేసిన, అభిమానులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు పవన్.
పవన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి.క్రిష్ సినిమాతో పాటు, అయ్యప్పయున్ కోషియమ్ రీమేక్ ఉంది. పవన్ కోసం ఈ రెండు సినిమాలూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. అయితే పవన్ ఇప్పటికిప్పుడు షూటింగుల్లోపాల్గొనే అవకాశం లేదు. కొన్ని రోజులైనా ఆయన విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరవాతే.. సినిమాల గురించి ఆలోచిస్తారు.