ఈమధ్య టాలీవుడ్ లో రీమేక సినిమాల హవా ఎక్కువైంది. బడా హీరోలు పొరుగు కథలపై మోజు పెంచుకుంటున్నారు. సునీల్ కీ రీమేక్ కథలంటే ఇష్టం. ఇప్పుడు తన చేతిలో రెండు సినిమాలున్నాయి. రెండూ రీమేక్‌లే. ఇప్పుడు మరో పరాయి కథపై ప్రేమ పెంచుకున్నాడు. అదే..‘మండేలా’. తమిళంలో విడుదలైన సినిమా ఇది. హాస్య నటుడు యోగిబాబు ప్రధాన పాత్ర పోషించాడు. మడోన్నే అశ్విన్ దర్శకత్వం వహిచాడు. ఏప్రిల్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈసినిమాకి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర `మండేలా` రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నారు. ఆయన సునీల్ తో ఈ సినిమా చేసే ఛాస్సుందని తెలుస్తోంది. దర్శకుడ్ని ఎంపిక చేసి, అతనితో తెలుగులో మార్పులు, చేర్పులూ చేయించే పనిలో ఉన్నారు అనిల్ సుంకర. నెల రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలన్నది ప్లాన్. ఇది కూడా డైరెక్ట్ ఓటీటీ సినిమా అని టాక్.