వ‌చ్చేస్తున్నా... ఆ ఇద్ద‌రికీ ప‌వ‌న్ మాటిచ్చేశాడు

మరిన్ని వార్తలు

జూన్ నుంచి షూటింగులు మొద‌లైపోతున్నాయి. అప్పుడే ద‌ర్శ‌క నిర్మాత‌లు కొత్త షెడ్యూల్స్ వేసేసుకుంటున్నారు. కానీ కొంత‌మంది అగ్ర హీరోలు క‌రోనా టైమ్‌లో షూటింగులంటే భ‌య‌ప‌డుతున్నారు. `ఇంకొన్ని రోజులు వేచి చూద్దాం` అనే ధోర‌ణిలో ఉన్నారు. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఒకేసారి రెండు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు.రెండు సినిమాల‌కూ ఒకేసారి కాల్షీట్లు పంచేశారు.

 

`వ‌కీల్ సాబ్‌`లో ప‌వ‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 70 శాతం షూటింగ్ అయిపోయింది. జూన్‌లో షూటింగులు ప్రారంభ‌మైన వెంట‌నే... ఈ సినిమాని ప‌ట్టాలెక్కించేస్తారు. ప‌వ‌న్ డైరీలో జూన్ కాల్షీట్లు అన్నీ ఈ సినిమాకే. జులై మాత్రం క్రిష్ సినిమాకి ఇచ్చాడు. క్రిష్ - ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మొఘ‌ల్ సామ్రాజ్యం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సినిమాకోసం భారీ సెట్లు నిర్మించారు. ఆ సెట్లోనే ప‌వ‌న్ సినిమా షూటింగ్ మొత్తం జ‌ర‌గ‌బోతోంది. జూన్‌లో క్రిష్ సినిమా మొద‌లైనా, ప‌వ‌న్ కోసం జులై వ‌ర‌కూ ఆగుతారు. జులై - ఆగ‌స్టుల మొత్తం క్రిష్ సినిమాతోనే గ‌డ‌ప‌బోతున్నాడు ప‌వ‌న్‌. వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమానీ పూర్తి చేసి 2021 ప్రారంభంలో హ‌రీష్ శంక‌ర్ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌నుకుంటున్నాడు. సో.. ఇక మీద‌ట పవ‌న్ సినిమాల గురించి క‌బుర్లే క‌బుర్లు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS