ఈసారి సంక్రాంతి పోటీ మామూలుగా లేదు

By iQlikMovies - July 28, 2021 - 14:15 PM IST

మరిన్ని వార్తలు

సంక్రాంతి అన‌గానే.. పెద్ద సినిమాల హ‌డావుడి గుర్తొస్తుంది. ఈ యేడాది క‌రోనా భ‌యాల్లో కూడా ఏకంగా నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. 2022లోనూ ఇదే జోరు క‌నిపించే అవ‌కాశాలున్నాయి. 2022 సంక్రాంతికి ఇప్పుడే బెర్తులు ఖాయ‌మైపోయాయి. వ‌చ్చే ఏడాది ఏకంగా 4 సినిమాలు విడుద‌ల‌కు రెడీ అయ్యాయి.

 

మ‌హేష్ బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న `స‌ర్కారు వారి పాట‌`ని సంక్రాంతి బ‌రిలో దింపాల‌న్న‌ది ప్లాన్‌. ద‌ర్శ‌క నిర్మాత‌ల టార్గెట్ కూడా అదే. మ‌హేష్ కూడా `ఈ సినిమాని ఎలాగైనా స‌రే - సంక్రాంతికే విడుద‌ల చేయాలి` అని గ‌ట్టిగా చెబుతున్నాడ‌ట‌. పైగా సంక్రాంతి మ‌హేష్ కి బాగా క‌లిసొచ్చింది. అందుకే ఈసారి కూడా ఆ సెంటిమెంట్ ఫాలో అవ్వాల‌నుకుంటున్నాడు.

 

ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఈ సంక్రాంతి పోటీకి సిద్ధ‌మ‌య్యాడు. రానాతో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ అయ్య‌ప్ప‌యున్ కోషియ‌మ్ ని ఈ సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర‌బృందం కూడా అధికారికంగా ప్ర‌క‌టించేసింది. ఇక ఎఫ్ 3 ఎలానూ ఉంది. 2020 సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎఫ్ 3ని సైతం సంక్రాంతికే విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఈ మూడు తెలుగు సినిమాల‌తో పాటు విజ‌య్ న‌టించిన `బీస్ట్` కూడా సంక్రాంతికే వ‌స్తోంద‌ట‌. ఈ సంక్రాంతికి `మాస్ట‌ర్‌` తెలుగులోనూ విడుద‌లై మంచి వ‌సూళ్లు అందుకుంది. అందుకే విజ‌య్ కూడా ఈ సంక్రాంతిని మిస్ చేసుకోకూడ‌దు అనుకుంటున్నాడు. సో.. ఇప్ప‌టికైతే నాలుగు సినిమాలు ప‌క్కా అయ్యాయి. ఇంకెన్ని బ‌రిలోకి దిగుతాయో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS