పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించి ఇంత వరకూ ఏ ఇన్‌ఫర్మేషన్ బయటికి రాలేదు. ఆగష్టు 15న ఈ సినిమా టైటిల్ రిలీజ్ అవుతుందని ఆశించారంతా. కానీ రాలేదు. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజు ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. మరో పక్క ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే ఆ రోజే తన సినిమా ఫస్ట్‌లుక్‌ని గానీ, టైటిల్ గానీ రిలీజ్ చేసే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నాడంటూ ఆయన సన్నిహితుల ద్వారా లభించిన సమాచారమ్. అన్నదమ్ముల మధ్య ఏవో పొరపొచ్చాలున్నాయనీ, అస్సలు వీరిద్దరికీ పొసగట్లేదనీ రూమర్స్ ఎప్పుడూ హల్ చల్ చేస్తున్న మాట వాస్తవమే. కానీ అలాంటి పొరపొచ్చాలు తమ మధ్య లేవని ఈ అన్నదమ్ములు ఎప్పటికప్పుడే నిరూపిస్తూనే ఉన్నారు. కానీ ఈ రూమర్స్‌కి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఈ సారి కూడా పవన్ చేసే ఈ ప్రయత్నం అలాంటి వారి నోర్లు మూసేందుకే అనుకోవాలి. అన్నయ్య పుట్టినరోజునాడు తన కొత్త సినిమా టైటిల్‌ని రిలీజ్ చేసే ఆలోచన అందుకే చేస్తున్నట్లు తెలియ వస్తోంది. ఇకపోతే పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.