సాహోలో ప్రభాస్‌తో జోడీ కట్టే హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడింది. ప్రభాస్ కథానాయికగా శ్రద్దా కపూర్ ఎంపికైంది. ముందు నుంచీ శ్రద్దా పేరు బలంగానే వినిపిస్తోంది. అయితే కళ్లు చెదిరే పారితోషికం డిమాండ్ చేస్తుండడంతో ఆమెను తీసుకోవాలా, వద్దా అనే సంశయంలో పడింది చిత్రబృందం. ఓ దశలో అనుష్క ఎంపిక ఖాయం అనే రేంజులో ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా మళ్లీ శ్రద్దా కపూర్ మళ్లీ రేసులోకి వచ్చింది. ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చి మరీ... ఈ సినిమాలో తీసుకొన్నార్ట. శ్రద్దా కపూర్ పారితోషికం రూ.4.5 కోట్లని సమాచారం. బాలీవుడ్‌లో ఆమెకంత డిమాండ్ ఉంది మరి. సాహోని బాలీవుడ్‌లోనూ భారీగా విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. అలా జరగాలంటే బాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు కొందరినైనా టీమ్‌లో తీసుకోవాలి. అందుకే శ్రద్దా అడిగినంత ఇవ్వాల్సివచ్చింది.