పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. 2018 జనవరిలో ఈ సినిమాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇప్పటి వరకూ సగానికి పైగానే షూటింగ్ పూర్తయింది. అయితే టైటిల్ ఏంటన్నది ఇంత వరకూ తేలలేదు. ఈమధ్యలో చాలా టైటిళ్లే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మరో కొత్త టైటిల్ వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం 'రాజు వచ్చినాడు' అనే మరో టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం ఎప్పుడు స్పందిస్తుందో మరి.