పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటించాక ఆయనతో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలన్న కోరిక ఉన్న వారి ఆశల పై నీళ్ళు చల్లినట్టయింది.
ఇటువంటి తరుణంలో అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలనానికి కేర్ అఫ్ అడ్రస్ గా మారిన సందీప్ రెడ్డి వంగ ఒక సంచలన చిత్రానికి శ్రీకారం చుట్తాడన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే- అర్జున్ రెడ్డి చిత్రం మంచి విజయం సాధించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆ చిత్ర దర్శకుడైన సందీప్ ని అభినందించిన సమయంలో వారి మధ్య ఒక కథ గురించిన చర్చ జరిగిందట.
సందీప్ చెప్పిన ఆ పాయింట్ నచ్చడంతో దానిని పక్కా స్క్రిప్ట్ గా చేసిన తనవద్దకు రమ్మని చెప్పాడట. అన్ని కుదిరితే త్వరలోనే పవన్-సందీప్ కాంబినేషన్ లో ఒక మెగా చిత్రం రూపొందనుంది.
అయితే ఈ వార్తలకి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.