నటసింహం బాలకృష్ణ పైన పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశాడు అని అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తున్నది.
ఆ వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ రావాలని శుక్రవారం నాడు అమరావతిలో ధర్మపోరాట దీక్ష సందర్భంగా ప్రధానమంత్రి ని నటుడు, MLA అయిన బాలకృష్ణ దుర్బాషలాడడం పైన అందరు ఆశ్చర్యపోయారు అందుకుగాను ఆయన పైన ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.
ఇక ఈ అంశంలో పవన్ కళ్యాణ్ ట్వీట్స్ పెడుతూ- ప్రధానమంత్రి ని తిడితే స్పెషల్ స్టేటస్ వస్తుందా? అయిన ఇప్పుడు తిట్టడమే ఒక పాలసీ గా పెట్టుకున్నారు అంటూ సదరు రాజకీయ పార్టీ పైన సెటైర్లు వేశాడు.
ప్రధానమంత్రి మోడీ ని తిట్టిన సందర్భంగా బాలకృష్ణ వార్తల్లోకి ఎక్కగా పవన్ పరోక్షంగా వేసిన సెటైర్లు బాలయ్య పైనే అని అంటున్నారు.