నటి శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు, అర్ధనగ్న నిరసనలు ఇలా గత రెండు మూడు వారాల నుండి ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
ఇక ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశం పైన విలేఖరులు అడగగా స్పందించారు. జమ్మూలోని ఆసిఫాపై జరిగిన అత్యాచారంపై ఈరోజు పవన్ కల్యాణ్ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆయన కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఇండస్ట్రీ లో ఆడవారి పైన జరుగుతున్న వేధింపుల పైన వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించ వచ్చు అని అయితే టీవీ ఛానల్స్ కి వెళితే సమస్య పరిష్కారం అవ్వదు అని చెప్పాడు. ఈ సందర్భంగా తాను కూడా ఇలాంటి రెండు మూడు సంఘటనలు జరిగితే తాను అడ్డుకున్నాను అని చెప్పాడు.
అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదురుకునేవారికి తమ మద్దతు అని ప్రకటించేశాడు.