ప్రముఖ సెలబ్రిటీ మహేష్ కత్తి పైన ఒక సునీత అనే అమ్మాయి కొద్దిసేపటి క్రింద ఒక టీవీ ఛానల్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ వివరాల్లోకి వెళితే, ఈమధ్యకాలంలో శ్రీ రెడ్డి అంశంలో #CastingCouch కి సంబంధించిన చర్చలో పాల్గొని ఆ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి విదితమే. ఇక తాజాగా ఈరోజు సునీత మాట్లాడుతూ- తాను మహేష్ కత్తి బిగ్ బాస్ నుండి నిష్క్రమించి వచ్చాక తన ఇంటికి వెళ్ళి కలిసాను అని ఆ సమయంలో తనపైన అసభ్యంగా ప్రవర్తించాడు అని అదే సమయంలో తాను ప్రతిఘంటించగా రూ 500/- ఇచ్చి ఎవరికి ఈ విషయం చెప్పకు అని బ్రతిమిలాడడు అని చెప్పింది.
ఇక దీనికి స్పందనగా మహేష్ మాట్లాడుతూ- తనకి అవసరం ఉన్నప్పుడల్లా ఒక సంవత్సరకాలం నుండి డబ్బుని తీసుకుని చివరికి తన పైన అత్యాచార ఆరోపణలు చేస్తున్నది అని.. కావాలంటే కోర్టులో కేసు వేయమని, తాను కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పాడు.
దానికి కౌంటర్ గా సునీత మరిన్ని ఆరోపణలు గుప్పించింది. ఇక దీనితో మహేష్ కత్తి మరోమారు కాంట్రవర్సీ కి కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయాడు.