తొలి సినిమా 'ముకుందా'తోనే తానేంటో నిరూపించేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సెకండ్ మూవీ 'కంచె'తోనూ హిట్ అందుకున్నాడు. అయితే మాస్ యాంగిల్ ట్రై చేసి 'లోఫర్'తో ఓకే అనిపించుకున్నాడు. కానీ 'మిస్టర్'తో నిరాశ పరిచాడు. ఇప్పుడు చాలా కామ్‌గా 'ఫిదా'తో వచ్చి, సెన్సేషనల్ హిట్‌ని తన ఖాతాలో వేసేసుకున్నాడు. చిన్న సినిమాగా స్టార్ట్ అయిన 'ఫిదా' హిట్ కొట్టడంతో బిగ్ టాక్‌నే సొంతం చేసుకుంటోంది. వసూళ్ల విషయంలో తన కన్నా మందొచ్చిన పెద్ద సినిమానే మించి పోతోందని ప్రచారం సాగుతోంది ఫిదా విషయంలో. అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి మధ్య లవ్ స్టోరీగా తెరకెక్కిన 'ఫిదా' చిత్రం ఇటు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్‌లోనూ దున్నేస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా 'ఫిదా' నిలిచిపోతుందంటున్నారు. సాయి పల్లవి నటన అందర్నీ ఆకట్టుకుంటోంది. 'ఫిదా' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న వరుణ్ తేజ్‌ని పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్ చేయాలనిపిస్తే ఏం సినిమా చేస్తావని ఆడిగితే, ఠక్కున 'ఛాలెంజ్' సినిమా రీమేక్‌లో నటిస్తా అని చెప్పాడు. ఆ సినిమా అంటే వరుణ్‌కి చాలా ఇష్టమట. అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో 'తమ్ముడు' సినిమా అంటే ఇష్టమట వరుణ్‌కి.