పవన్ కల్యాణ్ గత కొద్ది రోజుల నుంచీ హోం క్వారెంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన స్టాఫ్ లో కొంతమందికి కరోనా సోకడంతో, పవన్ ముందు జాగ్రత్తగా... క్వారెంటైన్లోకి వెళ్లిపోయారు. దాంతో... పవన్ ఆరోగ్యానికి ఏమైంది? ఆయనకు కరోనా సోకిందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు వీటికి సమాధానం దొరికింది. పవన్ కి కరోనా సోకలేదు. తాజాగా ఆయన చేసుకున్న పరీక్షల్లో నెగిటీవ్ గా రిపోర్ట్ వచ్చింది. దాంతో.. వవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.
పవన్ క్వారంటైన్ లోకి వెళ్లిపోవడంతో... సడన్ గా హరి హర వీరమల్లు, అయ్యప్పయుమ్ కోషియమ్ రీమేక్ లు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ వీటికి డేట్లు ఇవ్వబోతున్నాడట పవన్. జూన్ - జులై నాటికి అయ్యప్పయుమ్ కోషియమ్ రీమేక్ పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నాడని సమాచారం.