నితిన్ కోసం పవన్ కళ్యాణ్...

మరిన్ని వార్తలు

హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అన్నది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా హీరో నితిన్ అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడు పిలిచినా కాదనకుండా సినిమా ఈవెంట్స్ కి వస్తుంటాడు.

తాజాగా మరోసారి నితిన్ కోసం పవన్ కళ్యాణ్ ఒక ఫిలిం ఈవెంట్ కి రాబోతున్నాడు. ఈ నెల 25న జరగబోయే చల్ మోహన్ రంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ఇదే విషయాన్నీ నితిన్ తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు.

అయితే ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ –త్రివిక్రమ్ లు కలిసి నిర్మిస్తున్న నేపధ్యంలో ఆయన కచ్చితంగా సినిమా కోసం వస్తాడు అని అందరు తొలుత అనుకున్నా ఆయన ఈ మధ్య రాజకీయంగా బిజీ అవ్వడంతో అందరికి సందేహం ఏర్పడింది.

ఇక నితిన్ ట్వీట్ తో పవన్ కళ్యాణ్ రాకకి సంబంధించి క్లారిటీ వచ్చేసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS