పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఎప్పుడూ ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాడు. అయితే ఈ మధ్య పవన్ కొంచెం బొద్దుగా తయారయ్యాడు. దీనికి కారణం ఓ పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు ఇలా బిజీ లైఫ్ గడపడం కారణంగా పవన్ కాస్త ఒళ్లు చేశాడు. అయితే తాజాగా పవన్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అంతా ఈ ఫోటో గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలో పవన్ చాలా స్లిమ్‌గా అందంగా కనిపిస్తున్నాడు. దాంతో అంతా పవన్ స్లిమ్ అయ్యాడంటూ చెవులు కొరుక్కుంటున్నారు. అవును నిజమే త్రివిక్రమ్ సినిమా కోసం పవన్ చాలా హ్యాండ్‌సమ్ లుక్‌లోకి వచ్చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ సెట్‌లోని ఫోటోనే ఒకటి బయటికి వచ్చింది. ఆ ఫోటోలో తమ అభిమాన హీరో పవన్‌ని చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారంతే. ఈ ఫోటోలో పవన్ అభిమానులకు పలకరిస్తున్నట్లుగా ఉంది. కూల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'అత్తారింటికి దారేది' సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలతో పవన్ రొమాన్స్ చేశాడు. అలాగే ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్‌తో పవన్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్నారు. అందుకే ఇంత రొమాంటిక్ లుక్‌లోకి మారిపోయారన్న మాట.