ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు ఒకరు తెలుగు చలనచిత్ర పరిశ్రమ పైన కామెంట్స్ చేయడం దానికి ఇండస్ట్రీ తరపు నుండి కొందరు వాటికి కౌంటర్ వెయ్యడం కూడా జరిగింది.
ఇవ్వన్ని పక్కనపెడితే, ఈరోజు తెలుగు చిత్రపరిశ్రమకి చెందిన కొందరు ముఖ్యులు విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడుని కలిసి స్పెషల్ స్టేటస్ కోసం జరుపుతున్న పోరాటంలో తమవంతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొంటాము అని చెప్పారు.
అలాగే అందరు కూడా ఏప్రిల్ 7 వరకు నల్ల బ్యాడ్జీలతో కేంద్రానికి వ్యతిరేకంగా తమవంతు నిరసన తెలియచేస్తామని ప్రకటించారు. ఈ రోజు భేటీకి వచ్చినప్పుడు కూడా వారు నల్ల బ్యాడ్జీలతోనే రావడం విశేషం. ఈ మీటింగ్ తరువాత అంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి గ్యాప్ ఏర్పడింది అని వచ్చిన వార్తలకి తెరపడింది.
మరి ఈ పోరాటం చివరివరకు తమ సంఘీభావాన్ని కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాలి.