జనసేన కోసం సినిమాలకు దూరమయ్యాడు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికలు అయ్యాక... మళ్లీ కాస్త సినమాలపై గాలి మళ్లింది. చక చక రెండేళ్లలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి, మళ్లీ పాలిటిక్స్ పై ఫోకస్ చేద్దామనుకున్నాడు పవన్. సినిమాలు చేయడం వల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి ఆర్థికంగా బలపడడం. రెండోది. అభిమానులకు టచ్ లో ఉండడం. అందుకే చక చక కథలు విని, సినిమాల్ని ఓకే చేసుకున్నాడు. 2022 లోగా కనీసం నాలుగు సినిమాలు చేయాలన్నది పవన్ ప్లానింగు. కానీ కరోనా వల్ల ఆ ప్రణాళికలన్నీ తల్లకిందులయ్యాయి.
కరోనా వల్ల షూటింగులు ఆడిపోాయాయి. రిలీజ్ డేట్లుఅన్నీ మారిపోయాయి. పూర్తయి పోయిన సినిమాలకే దిక్కులేదు. కొత్త సినిమాల గురించి ఆలోచించడం సాహసమే. కరోనా వల్ల మిగిలిన హీరోల కంటే పవన్ కే ఎక్కువ నష్టం. ఎందుకంటే పవన్ డెడ్ లైన్ 2022. కరోనా వల్ల 2020 మర్చిపోవాల్సిందే అనిపిస్తోంది. షూటింగులు మళ్లీ మొదలైనా వకీల్ సాబ్ ముందు పూర్తి చేయాలి. ఆ తరవాత.. విరూపాక్ష ఉంటుంది. ఆ రెండూ అయ్యాకే.. మిగిలిన సినిమాలు పట్టాలెక్కుతాయి. అంటే.. వవన్ ఇప్పటికే ఓకే చేసిన కథలు కొన్ని పక్కన పెట్టాల్సిన అవసరం వస్తుంది. డాలీ, హరీష్ శంకర్ లతో పవన్ సినిమాలు చేస్తాడని అనుకుంటున్నారు.
అయితే.. ఇవి రెండూ ప్రస్తుతానికి డౌటే అనిపిస్తోంది. 2022 లోగా నాలుగు సినిమాలు కాస్తా.. 2కే పరిమితం అవ్వొచ్చు. ఇది పవన్ అభిమానులకు చేదు వార్తే.