కేసీఆర్ ప్రభుత్వం.... తెలుగు చిత్రసీమకు తీపి కబురు అందించింది. టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించింది. ఈ విధానం... పెద్ద సినిమాలకు లాభదాయకమే. ఈ సీజన్‌లో రాబోతున్న తొలి పెద్ద సినిమా `వకీల్ సాబ్`. వీలైతే సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది దిల్ రాజు ప్లాన్. సంక్రాంతి సీజన్, అందులోనూ పెద్ద సినిమా, పైగా.. పవన్ సుదీర్ఘ విరామం తరవాత చేస్తున్న సినిమా. కాబట్టి.. పవన్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడే ఛాన్సుంది.
టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇదే పెద్ద ఛాన్స్. పైగా ఫ్యాన్ షోలు, బెనిఫిట్ షోలూ.. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవొచ్చు. ఇదంతా.. `వకీల్ సాబ్` కి కలిసొచ్చే విషయాలు. `వకీల్ సాబ్` టికెట్ రేట్లు పెంచినా, జనం చూడ్డానికి ముందుకు వచ్చారంటే... మిగిలిన పెద్ద సినిమాలకు అది భరోసాగా ఉంటుంది. టికెట్ రేట్లు పెంచుకోవాలా, వద్దా, షోలు ఎన్నయితే మంచిది అన్న విషయాలపై అవగాహన రావాలంటే `వకీల్ సాబ్` రావాలి. ఈ సినిమాతో దాదాపు 100 కోట్లయినా రాబట్టాలన్నది దిల్ రాజు లక్ష్యం. టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉంది కాబట్టి.. ఇప్పుడు అది పెద్ద మాటర్ కాకపోవొచ్చు. సో.. టికెట్ రేట్ల పెంపుతో.. దిల్ రాజు నోట్లో పాలు పోసినట్టైంది.