‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోలిద్దరూ విక్రమ్‌కే సెట్టయ్యారు.!

మరిన్ని వార్తలు

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం పోటీ పడి నటించేందుకు సిద్ధమవుతున్న చరణ్‌, ఎన్టీఆర్‌ తమ తమ తదుపరి ప్రాజెక్ట్‌లను కూడా లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అనుకోకుండా జరిగిన కో ఇన్సిడెంట్‌ ఏమో కానీ, ఇద్దరూ తమ తదుపరి చిత్రాలకు డైరెక్టర్‌ విక్రమ్స్‌కే కమిట్‌ అవ్వడం విశేషం. ‘అల వైకుంఠపురములో’ హిట్‌ తర్వాత డైరెక్టర్‌ త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అలాగే, చరణ్‌ కూడా తన తదుపరి ప్రాజెక్ట్‌ సిద్ధం చేశాడు.

 

‘24’, ‘మనం’, ‘హలో’ చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కుమార్‌తో చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్‌ ఉండబోతోందనేది తాజా న్యూస్‌. అయితే ఈ ఇద్దరు హీరోలు వచ్చే ఏడాది వరకూ ఖాళీ అవ్వరన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో రిలీజ్‌ కావల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్‌ పోన్‌ అయ్యింది. సో ఆ సినిమా రిలీజ్‌ వరకూ మరో ప్రాజెక్ట్‌ టేకప్‌ చేయకూడదని రాజమౌళి రూల్‌. సో వచ్చే ఏడాదే ఈ రెండు సినిమాలూ పట్టాలెక్కనున్నాయన్న మాట. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కొమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటించనున్నాడు. బాలీవుడ్‌ భామ అలియా భట్‌, హాలీవుడ్‌ భామ ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ నటుడు సముద్రఖని, బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS