అమితాబ్ ని ఫాలో అయిపోండి: ప‌వ‌న్ ఆదేశం!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన `పింక్‌` చిత్రాన్ని తెలుగులో `వ‌కీల్ సాబ్‌`గా తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ అమితాబ్ చేసిన పాత్ర‌లో ఇక్కడ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నిపించ‌నున్నాడు. దాదాపు 70 శాతం షూటింగ్ జ‌రిగింది. ప‌వ‌న్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు బాకీ ఉన్నాయి. పింక్‌లో బిగ్ బీది వృద్ధ లాయ‌ర్ పాత్ర‌. కాబ‌ట్టి హీరోయిన్లూ, రొమాన్స్ అవ‌స‌రం లేకుండా పోయాయి. ఇక్క‌డ అలా కాదు క‌దా. ప‌వ‌న్ ని అలా చూపించ‌లేంఉ. కాబ‌ట్టి హీరోయిన్‌, రొమాన్స్ అవ‌స‌రం అయ్యాయి. దానికి సంబంధించిన స‌న్నివేశాలు ఇంకా తెర‌కెక్కించలేదు. కానీ ఇప్పుడు ప‌వ‌న్ ఆలోచ‌న మారింద‌ని స‌మాచారం.

 

వ‌కీల్ సాబ్ లో కూడా.. రొమాన్స్‌, హీరోయిన్‌కి చోటు ఇవ్వొద్ద‌ని ప‌వ‌న్ చెప్పేశాడ‌ట‌. ఆయా స‌న్నివేశాలు ఉంటే తొల‌గించ‌మ‌ని, లేదంటే, వాటి నిడివి బాగా త‌గ్గించ‌మ‌ని ఆదేశించాడ‌ట‌. బాలీవుడ్ లో అమితాబ్ పాత్ర ఎంత హుందాగా ఉందో, ఇక్క‌డా అలానే ఉండాల‌ని, అప్పుడే ఆ పాత్రపై ప్రేక్ష‌కుల‌కు గౌర‌వం పెరుగుతుంద‌ని చెప్పాడ‌ట‌. దాంతో.. స్క్రిప్టు లో కీల‌మైన మార్పులు మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తోంది. కాక‌పోతే.. ఒక‌ట్రెండు ఫైట్స్ కి మాత్రం అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని చోటిచ్చార‌ని స‌మాచారం. మొత్తానికి వ‌కీల్ సాబ్ లో రొమాన్స్‌నీ, హీరోయిన్ల‌తో డ్యూయెట్ల‌న్నీ ఆశించ‌కూడ‌ద‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS