సంక్రాంతి బరిలో పవన్-బాలయ్య

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-నటసింహం బాలకృష్ణ లు తమ చిత్రాలతో రాబోయే సంక్రాంతికి రానున్నారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల చిత్రం జనవరి 10న విడుదల అవుతుండగా బాలకృష్ణ ‘జై సింహ’ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. పోయిన ఏడాది బాలయ్య తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం విడుదల చేశాడు. కాకతాలియంగా ఆ సమయంలోనే చిరంజీవి ఖైదీ నెం 150 విడుదల అవ్వడం జరిగింది.

పోయిన ఏడాది అన్నయ్యతో పోటీపడ్డ బాలయ్య ఈ సంవత్సరం తమ్ముడు పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతుండడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ చిత్రం షూటింగ్ కూడా చివరిదశకు చేరుకుంది అలాగే బాలయ్య చిత్రం కూడా దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకుంది.

ఇక వచ్చే సంక్రాంతికి కూడా నందమూరి-మెగా సినిమాల జోరు చూడనున్నామనమాట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS