'ఆర్ ఎక్స్ 100' సినిమాతో తొలి సినిమాకే సూపర్ డూపర్ హిట్‌ని సొంతం చేసుకుంది ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమా అయినప్పటికీ, సినిమాకి ఎంత అవసరం అనే ఆలోచన లేకుండా ఎక్స్‌పోజింగ్‌కి రెడీ అయిపోయింది. అఫ్‌కోర్స్ ఆమె ఎక్స్‌పోజింగే సినిమాకి పెద్ద ప్లస్ అయ్యిందిలెండి. అది వేరే విషయం.
ఈ సినిమాలో అమ్మడు చూపించిన హాట్‌నెస్ డోస్‌ని ఇంకా కుర్రకారు మర్చిపోలేకపోతున్నారు. అందుకే గుర్తొచ్చినప్పుడల్లా ధియేటర్‌కి వెళ్లి 'ఆర్‌ఎక్స్ 100' సినిమా చూసి, అమ్మడి అందాల్ని మనసారా ఆస్వాదించి వచ్చేస్తున్నారు. తద్వారా బాక్సాఫీస్ కలెక్షన్లు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోతూ, నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చేలా చేసేస్తోంది.
ఇకపోతే, ఈ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు మిగిలిన నిర్మాతలు కూడా. అందుకే ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్‌కి పిలిచి మరీ ఆఫర్లు ఇచ్చేస్తున్నారట. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేసి పెట్టిందట పాయల్. తనకి పిలిచి ఆఫర్లు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు అమ్మడు కూడా ఫ్రీ ఆఫర్ ఇస్తోందట. అదేంటంటారా? అదేనండి, సినిమాలో ఎంత బోల్డ్‌గా నటించడానికైనా తాను సిద్ధమే అని హాట్ ఆఫర్ ఇచ్చేస్తోందట.
ఇంకేం కావాలి దర్శక నిర్మాతలకు. ఎలాంటి మొహమాటం లేకుండా బోల్డ్ సన్నివేశాలను డిజైన్ చేసేస్తున్నారట అమ్మడి కోసం. అంటే మరోసారి పాయల్ ఆన్ స్క్రీన్ అందాల ఆరబోతకు సిద్ధమైపోతుందనే భావించాలి. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలోనూ పాయల్ హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతోంది. దాంతో ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియా ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోతున్నారట.