నేనేమంత బోల్డ్‌ కాదంటోన్న 'ఆర్‌ఎక్స్‌' బ్యూటీ.!

మరిన్ని వార్తలు

పాయల్‌ రాజ్‌పుత్‌కి తొలి సినిమాతోనే అంత క్రేజ్‌ వచ్చేయడానికి కారణం 'ఆర్‌ ఎక్స్‌ 100'లో ఆమె నటించిన బోల్డ్‌ సీన్లే కావచ్చు. కథకు అనుగుణంగా ఆ సినిమాకి అంత బోల్డ్‌గా నటించాను. కానీ మాది చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ అంటోంది ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌. 

అసలింతకీ ఫ్యామిలీ గురించి ఎందుకు చెబుతోంది అంటే అందుకు వేరే కారణం ఉందిలెండి. ఇకపోతే పంజాబీలో పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న ఈమెకు 'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రం తెలుగులో మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఊహించని విజయం అది ఆమెకు. ఈ పాత్రను ఒప్పుకునేటప్పుడే కొంచెం ఆలోచించిందట. తొలి చిత్రానికే నెగిటివ్‌ రోల్‌ అంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని భయపడిందట. అయితే తొలి నుండీ ఈ ముద్దుగుమ్మ ఆలోచనా తీరు కాస్త భిన్నమైనదేనట. 

పంజాబీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన అనుభవం ఉన్న కారణంగా, కథలను ఎంచుకోవడంలో మంచి పట్టుంది. అందుకే తొలి సినిమాకే ఈ తరహా కంటెన్ట్‌ ఉన్న చిత్రాన్ని సెలెక్ట్‌ చేసుకుంది. అయితే ఆ తర్వాత కూడా ఆమెకు అలాంటి ఆఫర్సే వస్తున్నాయట. కానీ ఒకే తరహా క్యారెక్టర్‌కి తాను స్టిక్‌ఆన్‌ అయ్యే నటిని కాదంటోంది. భిన్నమైన క్యారెక్టర్స్‌లో నటించాలని ఉందంటోంది. 

ముఖ్యంగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ అంటే ఈ హాట్‌ బ్యూటీకి ఇష్టమట. అయితే కెరీర్‌ తొలి నాళ్లలోనే ఇంత బిగ్‌ థాట్‌ చేయడం సబబు కాదు కానీ, 'ఆర్‌ఎక్స్‌ 100'లో అమ్మడి పర్‌ఫామెన్స్‌ చూశాక, ఏమో అలాంటి ఆఫర్లు త్వరలోనే తగిలినా తగలొచ్చునేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS