అయ్యయ్యో నానీ ఇది నువ్వేనా.?

మరిన్ని వార్తలు

'సిందరవందర సుందరవదనా.. అయ్యయ్యో ఇది నువ్వేనా..' అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. 'దేవదాస్‌' సినిమాలోనిదీ సాంగ్‌. 

నాగార్జున - నాని కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. మొన్నీ మధ్యనే విడుదలైన 'వారూ వీరూ' లిరికల్‌ సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఫస్ట్‌ పెగ్‌లో 'దాసూ ఏంటీ సంగతి..?' అంటూ టీజర్‌తో ఓ రకమైన కిక్‌ ఇచ్చారు 'దేవదాస్‌' టీమ్‌. 

తాజాగా రిలీజైన లిరికల్‌ సాంగ్‌ నాని మీద సోలోగా సాగే ఫన్‌ సాంగ్‌. డాన్‌ దగ్గర నాని కష్టాల్ని వివరిస్తూ రాసిన ఫన్‌ లిరిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఫన్‌ టోన్‌తో సాగే ఈ సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే నాని ఫన్‌ స్టిల్స్‌ బాగున్నాయి. టోటల్‌గా ఈ సినిమాలో నాని చాలా చాలా కామెడీ రోల్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నాని నోటి నుండి ఇంతవరకూ ఒక్క డైలాగ్‌ కూడా వినిపించలేదు కానీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇరగేసేస్తున్నాడు. 

ఫస్ట్‌పెగ్‌లో నాని ఎక్స్‌ప్రెషన్స్‌ చార్లీ చాప్లిన్‌ని తలపిస్తున్నాయి. తాజా లిరికల్‌ సాంగ్‌లో 'నీకేమో నటన రాదు..' అంటూనే నటనలో ఇంత కొత్త యాంగిల్‌ చూపించేస్తున్నాడు. రష్మికా మండన్నా ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తోంది. ఇక నాగార్జున కామెడీ టైమింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS