వివాదాలతో ఫేమస్ అవుతున్న పాయల్

మరిన్ని వార్తలు

పాయల్ రాజ్ పుత్ అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆర్ఎక్స్ 100 హీరోయిన్ అంటే తెలియని వారుండరు. ఈ సినిమా తరవాత పలు తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. గతఏడాది పాయల్ నటించిన మంగళవారం సినిమా సక్సెస్ సాధించింది. దీనితో అరకొర అవకాశాలు వస్తున్నాయి పాయల్ కి. ఎలాగూ సినిమాలు లేవు వివాదాలతో అయినా పాపులర్ అవుదాం అనుకుందో ఏమో ఒక ప్రొడ్యూసర్ తో గొడవపడి మీడియా కెక్కింది. ఇందులో మాత్రం సక్సెస్ అయింది. ఇప్పుడు ఎక్కడా చూసినా పాయల్, నిర్మాత ప్రణదీప్  వివాదం వినిపిస్తోంది. 


అసలేం జరిగింది అంటే పాయల్ తో ప్రణదీప్ 'రక్షణ' అనే సినిమా తెరకెక్కించగా, కొన్ని సమస్యల కారణంగా అది రిలీజ్ కాలేదు. ఇప్పుడు అన్ని అనుకూలించి ఆ మూవీని రిలీజ్ చేసే పనిలో పడ్డారు ప్రణదీప్. ఈ క్రమంలో పాయల్ ని ప్రమోషన్స్ లో పాల్గొనమని అభ్యర్దించగా ఆమె నో చెప్పింది. దీనితో చేసేదేం లేక నిర్మాత తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు కంప్లైన్ట్ చేశారు. ఈ వివాదం పై పాయల్ స్పందిస్తూ నాకు టోటల్ అమౌంట్ ఇవ్వలేదని, మొత్తం ఇస్తే ప్రమోషన్స్ లో పాల్గొంటామని చెప్పినట్టు చెప్తోంది. అగ్రిమెంట్‌ ప్రకారం రెమ్యునరేషన్‌ ఇవ్వకుండానే ప్రమోషన్స్ కు రావాలని ఒత్తిడి తెస్తున్నారు. రాకపోతే ఇండస్ట్రీ నుంచి బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధం అని పోస్ట్ చేసింది పాయల్.


అంతే కాక ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్స్ పై నిందలు వేసింది. ప్రమోషన్స్ లో కొంచెం ఎక్సపోజింగ్ చేయమని ఒత్తిడి తెస్తున్నారని, అందుకనే తాను తిరస్కరించినట్టు కొత్త వివాదం తెచ్చింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించడంతో నిజానిజాలు బయటికి వచ్చాయి. అమ్మడు ఎందుకు ఇలా చేస్తోంది అని సినీవిశ్లేషకులు అంటున్నారు. సినిమా ఛాన్స్ లేకపోయినా, ఎప్పటికప్పుడు సొషల్మీడియా లో అరకొరా దుస్తులతో సందడి చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు నోటికి వచ్చినది మాటాడుతూ వైరలవుతుంది. ఇప్పుడు ఏకంగా వివాదాలతో ఫేమస్ అవ్వాలని చూస్తుందేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS