తొలి సినిమా ఆర్.ఎక్స్ 100తో ఓ కుదుపు కుదిపేసింది పాయల్ రాజ్ పుత్. బోల్డ్ సీన్ లలో రెచ్చిపోయి నటించేసింది. ఆ సినిమాతోనే.. ఓ అరడజను సినిమాల్ని సంపాదించింది. అయితే అందులో ఏ ఒక్కటీ పాయల్‌కి కలిసి రాలేదు. `వెంకీ మామ`లో నటించినా పెద్దగా ప్లస్ కాలేదు. పైగా ముదురు ఫేసు అన్న నెగిటీవ్ కామెంట్లని మూటగట్టుకుంది. ఇక పాయల్‌ని మర్చిపోవాల్సిందే అనుకుంటున్న తరుణంలో ఓ బంగారం లాంటి ఆఫర్ ని అందుకుంది.
భారతీయుడు 2 లో పాయల్ ఓ ప్రత్యేక గీతంలో నర్తిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కమల్ హాసన్ - శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రమిది. కాజల్, రకుల్ కథానాయికలు. ఇప్పుడు ఈ జాబితాలో పాయల్ కీ చోటు దక్కినట్టు తెలుస్తోంది. శంకర్ సినిమాల్లో పాటలన్నీ రిచ్ గా ఉంటాయి. అందులోనూ ఐటెమ్ గీతం అంటే.. భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తాడు. పైగా తన సినిమాలకు పాన్ ఇండియా క్రేజ్ ఉంటుంది. ఏ లెక్కన చూసినా.. ఈ సినిమాతో పాయల్ దశ తిరగడం ఖాయం అనిపిస్తోంది. మరి ఈ ఛాన్స్ ని పాయల్ ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.