'ఆర్ ఎక్స్ 100' సినిమాతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమా ప్రభంజనంతో, ఆ తర్వాత కూడా తనకు అలాంటి పాత్రలే వస్తున్నాయనీ, కానీ, తాను ఆ టైప్ హీరోయిన్ కాదనీ, తనలోని నటనకు ఛాలెంజ్ చేసే క్యారెక్టర్సే ఎంచుకుంటానని అలాంటి పాత్రల్ని రిజక్ట్ చేస్తున్నానని ఓ సందర్భంలో పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో విక్టరీ వెంకటేష్‌తో 'వెంకీ మామ', రవితేజతో 'డిస్కోరాజా' సినిమాలను ఎంపిక చేసుకుంది.
ఈ రెండింటితో పాటు, పాయల్ మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే 'ఆర్‌డీఎక్స్ లవ్'. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతవరకూ విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లు ఓ రేంజ్‌లో తాపం పెంచుతూనే ఉన్నాయి. 'ఆర్ ఎక్స్ 100' సెగల్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. అయితే, పాయల్ చెప్పిన మాటల ప్రకారం సినిమాలో కంటెంట్ ఎలాగున్నా, హీటు పుట్టించే పోస్టర్స్‌తో ప్రమోట్ చేస్తున్నారంతే అనుకున్నారంతా. కానీ, తాజాగా ఈ సినిమా టీజర్ బయటికి వదిలారు. టీజర్ చూస్తే అసలు సినిమా ఏంటో అర్ధమైపోయింది.
'ఆర్ ఎక్స్ 100'ని తలదన్నేలా విజువల్స్ ఉన్నాయి. 'సేఫ్టీ', 'సేఫ్టీ' అంటూ పదే పదే కండోమ్స్ ప్రస్థావన, 'పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు, మన ఫీలింగ్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి.. లేదంటే, సేఫ్టీస్ (కండోమ్స్) అయినా దగ్గర పెట్టుకోవాలి..' అంటూ పాయల్ చెప్పే డైలాగ్ ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి డైలాగులతో, శృతిమించిన బోల్డ్ సీన్స్‌తో టీజర్ నింపేశారు. టోటల్‌గా ఈ బోల్డ్ పాప మరోసారి బోల్డ్ కంటెంట్‌తో వచ్చేస్తోంది. మరి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలిక.