మోహన్ బాబు కెరీర్లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే ఓ మైల్ స్టోన్... పెదరాయుడు. మోహన్‌బాబు, రజనీకాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకుడు. భానుప్రియ, సౌందర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలై నేటికి పాతికేళ్లు.
ఈ సినిమాని రీమేక్ చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. విష్ణు, మనోజ్లలో ఎవరో ఒకరు ఈ సినిమా చేస్తారని చెప్పుకున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం ఈ సినిమాని రీమేక్ చేయడం అసాధ్యం అంటున్నారు. పెదరాయుడు మ్యాజిక్‌ని రీ క్రియేట్ చేయలేమని, అవసరమైతే.. సీక్వెల్ చేయొచ్చని మోహన్ బాబు అభిప్రాయ పడుతున్నారు. అయితే జమానా మారింది. ప్రజలు కొత్త తరహా కథలకు అలవాటు పడ్డారు. ఈరోజుల్లోనూ పెదరాయుడు, పంచాయితీలూ లాంటి కథలు చూడలేరు. `పెదరాయుడు` పెదరాయుడే. అలాంటి సినిమాల్ని టీవీల్లో చూసి ఆనందించాలి తప్ప, రీమేకులు, సీక్వెల్సూ అంటే పాడు చేయకూడదు. విష్ణు, మనోజ్‌లు సైతం ఆ ధైర్యం చేయలేరేమో అనిపిస్తోంది.