సుశాంత్ ఆత్మహ‌త్య‌కీ ఆ హీరోయిన్‌కీ లింకేమిటి?

మరిన్ని వార్తలు

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఆత్మ‌హ‌త్య చిత్ర‌సీమ‌ని కుదిపివేసింది. `ఇంత ప్ర‌తిభావంత‌మైన న‌టుడు, విజ‌య‌వంత‌మైన క‌థానాయ‌కుడు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏమిటి?` అంటూ ఆశ్చ‌ర్య‌పోయింది. ఈ ఆత్మ‌హ‌త్య వెనుక ఇప్పుడిప్పుడే ఎన్నో అనుమానాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. సుశాంత్ గ‌త కొంత‌కాలంగా డిప్రెష‌న్ లో ఉన్నాడ‌ని, అందుకు సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటున్నాడ‌ని పోలీసుల ప్రాధ‌మిక ప‌రీక్ష‌లో నిర్దార‌ణ అయ్యింది. అందుకే దీన్ని ఆత్మ‌హ‌త్య‌గా భావిస్తున్నారు. కానీ.. సుశాంత్ ది ఓ ల‌వ్ ఫెయిల్యూర్ స్టోరీ అని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

 

సుశాంత్ కి ఇది వ‌ర‌కు ఓసారి బ్రేక‌ప్ అయ్యింది. ఆ త‌ర‌వాత కొంత‌కాలానికి క‌థానాయిక కృతి స‌న‌న్ తో సుశాంత్ డేటింగ్ చేశాడు. కొంత‌కాలానికి ఇద్ద‌రూ విడిపోయారు. ఈమ‌ధ్య కృతి స‌న‌న్ మ‌ళ్లీ ట‌చ్‌లోకి వ‌చ్చింద‌ని, ఇద్ద‌రూ మ‌ళ్లీ ఇదివ‌ర‌క‌టిలా క‌లిశార‌ని తెలుస్తోంది. ఈమ‌ధ్యే సుశాంత్ మాజీ మేనేజ‌ర్ దిశ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆ ఘ‌ట‌న సుశాంత్‌ని బాగా క‌ల‌చి వేసింద‌ని చెప్పుకుంటున్నారు. ఈ విష‌యాల‌న్నీ సుశాంత్‌ని మాన‌సికంగా మ‌రింత కృంగిపోయేలా చేశాయి. అందుకే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చి ఉంటాడు. అయితే సుశాంత్ ది ఆత్మ‌హ‌త్య కాద‌ని, హ‌త్య అని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విష‌య‌మై పోలీసులు కూలంకుశంగా ద‌ర్యాప్తు చేయాల‌ని కోరుకుంటున్నారు. పోలీసులు అన్ని వైపుల నుంచీ... ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేస్తే అస‌లు నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS