మహానటితో తెలుగునాటే కాదు... టోటల్‌గా దక్షిణాదినే మంచి గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్. ఆమే కోసం లేడీ ఓరియెంటెడ్ కథలు పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగా చేసిన సినిమా 'పెంగ్విన్`. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో రూపొందించారు. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూసి వేసిన నేపథ్యంలో ఈసినిమాని నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు. ఈనెల 19న ఆమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా చూడొచ్చు. ఈరోజు టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తుంటే, ఇదో సైకో థ్రిల్లర్ అని అర్థమవుతోంది. పిల్లల్ని ఎత్తుకుపోయే ఓ రాక్షసుడు.. తన చేతికి చిక్కిన బిడ్డ కోసం కీర్తి సురేష్ పడే ఆరాటం.
ఇదీ స్థూలంగా ఈ సినిమా కథ. టీజర్ థ్రిల్లింగ్ గా ఉంది. సైకో గెటప్ చార్లీ చాప్లిన్ని పోలి ఉంది. సైకోతో ప్రేక్షకుల్ని భయ పెట్టాలని దర్శక నిర్మాతలు ఫిక్సయ్యారు. నటిగా... కీర్తి ఇంత సీరియస్ పాత్రని ఇది వరకు పోషించలేదేమో..? మొత్తానికి టీజర్ ఇంట్రస్టింగ్‌గానే ఉంది. ఈనెల 11న ట్రైలర్ రాబోతోంది. అదెలా ఉంటుందో చూడాలి. నాలుగు భాషల్లో విడుదల చేయడం.. నిర్మాతలకు గిట్టుబాటు వ్యవహారమే. మరి అమేజాన్‌లో ఈ సినిమాని ఆదరణ ఎలా ఉంటుందో..?