షూటింగుల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌.. ఎన్నో రాయితీలు.

మరిన్ని వార్తలు

తెలుగు సినిమాకి మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తున్నాయి. లాక్ డౌన్ వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. విడుద‌ల‌లు వాయిదా ప‌డ్డాయి. మ‌ళ్లీ షూటింగుల‌కు ఎప్పుడు అనుమ‌తి ఇస్తారా అని తెలుగు సినీ జ‌నాలు, అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో సినిమా, టి.వి. షూటింగుల ప్రక్రియను సులభతరం చేయ‌బోతోంది ప్ర‌భుత్వం.

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమా, టివి మరియు థియేటర్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సింగిల్ విండో పథకం ఏర్పాటు చేసి షూటింగుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌బోతోంది. నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ, మరియ టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగులకు అనుమతులు ఇవ్వాల‌ని భావిస్తోంది. గతంలో నిర్ణయించిన ఫీజులను, కాషన్ డిపాజిట్లను కార్పొరేషన్ కు కట్టించుకొని, షూటింగ్ ముగిసిన అనంతరం వాటిని రిఫండ్ చేయ‌బోతోంది. షూటింగుల‌ను మూడు కేట‌రిగీలుగా విడ‌గొట్ట‌బోతున్నారిప్పుడు.

 

కేటగిరి-1:

రోజుకి కాషన్ డిపాజిట్ 15 వేలు..

రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న పార్కుల్లో షూటింగులకు అనుమతి.. పట్టణాభివృద్ధి సంస్థ పార్కులు, మునిసిపల్ కార్పొరేషన్ అధీనంలో ఉన్న పార్కులలో షూటింగులకు అనుమతి.. రాష్ట్రంలోని వివిధ మ్యూజియంలు, బిల్డింగులు, పాఠశాలలు మరియు కాలేజీలలో షూటింగులకు అనుమతి..

 

కేటగిరి-2:

రోజుకి కాషన్ డిపాజిట్ 10 వేలు..

రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులు, ఎపిటిడిసి ఆధ్వర్యంలో ఉన్న సరస్సులు మరియు ఉద్యానవనాలు, జిల్లా కేంద్రాల్లోని పాఠశాలలు, కాలేజీలు, విజయవాడలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో షూటింగులకు అనుమతి..

 

కేటగిరి-3:

రోజుకి కాషన్ డిపాజిట్ 5 వేలు.. 

మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, పార్కులు, బీచ్ లు, అలిపిరి గార్డెన్లతో సహా, అన్ని పార్కుల్లో షూటింగులకు అనుమతి.. ఏపీటిడిసి, ఆర్&బి, ఇరిగేషన్ శాఖల లొకేషన్లలో షూటింగులకు అనుమతి..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS