ఒక సినిమాకి ఒక్క దర్శకుడే ఉంటాడు. ఒకే కథ ఉంటుంది. నాలుగు కథలూ, నలుగురు దర్శకులూ ఉండి.. ఆ నాలుగు కథల్నీ ఒకే చోట ముడి వేస్తే.. దాన్నిఆంథాలజీ అంటారు. తెలుగులో అలాంటి ఆంథాలజీ ఒకటి వస్తోంది. అదే పిట్టకథలు. నెట్ ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న ఈ వెబ్ మూవీని విడుదల చేస్తున్నారు. నాగ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు.
ఒకొక్కరూ.. ఒక్కో కథని తెరకెక్కించారు. బోల్డ్ గా ఉండే నలుగురి అమ్మాయిల కథలు ఇవి. ఆ పాత్రల్లో శ్రుతిహాసన్, మంచు లక్ష్మి, ఇషా రెబ్బా, అమలాపాల్ నటించారు. టీజర్ కూడా విడుదలైంది. అది చూస్తే... పిట్టకథల్లో హాట్ సన్నివేశాలకు కొదవ లేదనిపిస్తోంది. నెట్ ఫిక్స్‌లో ఆంథాలజీ కథలు వస్తున్నా.. తెలుగులో ఇప్పటి వరకూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ఇదే మొదటి సారి. మరి దీని ఫలితం ఎలా వుంటుందో?