చిత్రసీమలో హిట్టున్నవాళ్లదే రాజ్యం. చిన్న సినిమాతో హిట్టు కొడితే - స్టార్ల నుంచి కూడా పిలుపు వస్తుంది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయినవాళ్లెంతోమంది. ఒక్క సినిమాకే అథఃపాతాళానికి పడిపోయే వాళ్లు కూడా ఉన్నారు. ఓ ఫ్లాపుతో బడా బడా ఆఫర్లని కోల్పోయిన వాళ్లు చాలామంది కనిపిస్తారు. అలాంటి వాళ్లలో ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ కూడా చేరిపోతాడు. కందిరీగతో ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ శ్రీనివాస్. ఆ తరవాత ఎన్టీఆర్ తో రభస చేసే ఛాన్స్ వచ్చింది. దాన్ని చేచేతులా పాడు చేసుకున్నాడు.
హైపర్ ఓకే అనిపించుకోవడంతో అల్లుడు అదుర్స్ చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా హిట్టయితే బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ వచ్చేద్దును. `బలరామయ్య బరిలోకి దిగితే` అనే కథ రాసుకున్నాడు సంతోష్ శ్రీనివాస్. ఈ కథ బాలయ్యతో చేద్దామన్నది తన ప్లాన్. బాలయ్య కూడా ఈ సినిమా హిట్ అయితే... సంతోష్ శ్రీనివాస్ కి అవకాశం ఇద్దామనుకున్నాడు. అయితే అల్లుడు అదుర్స్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో.. సంతోష్ శ్రీనివాస్‌కి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్టు అయ్యింది. బాలయ్యే కాదు... ఇప్పుడ ఏ హీరో.. సంతోష్ తో సినిమా చేసే రిస్కు తీసుకోలేడేమో..?