ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ప్రియా ప్రకాష్ వారియర్’ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో..
ఎందుకంటే- ప్రియా ప్రకాష్ వారియర్ తను నటించిన మలయాళ చిత్రం ఒరు అదర్ లవ్ కి సంబంధించిన టీజర్ లో ఆమె పలికించిన అభినయం ఇప్పుడు ఆమెని రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. ఇక ఆ టీజర్ కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మరొక టీజర్ ని నిన్న విడుదల చేసింది ఆ చిత్ర యూనిట్.
ఇక కుర్రకారు అందరూ ఆమె అభినయానికి ఫిదా అవుతుంటే, హైదరాబాద్ లోని కొందరు యువకులు మాత్రం ఆమె చేసిన పని తమ మతం మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉంది అంటూ మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ప్రియా ప్రకాష్ వారియర్ పేరు ని కూడా చేర్చడం తో ఆమె పైన పోలీస్ కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి ప్రకాష్ వారియర్ కనిపించిన 10 సెకండ్ల వీడియో తో ఆమెకి స్టార్ డంతో పాటుగా ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా వస్తున్నాయి.