స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ మధ్య లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న లేడీ కొరియో గ్రాఫర్ కంప్లైంట్ ఫైల్ చేయటంతో అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్ గూడా జైలుకి తరలించారు. తరువాత కండీషనల్ బెయిల్ పై రిలీజ్ అయ్యారు. ప్రజంట్ బెయిల్ పై బయట ఉన్న జానీకి ఊహంచని షాక్ తగిలింది. కారణం నార్సింగ్ పోలీసులు మళ్ళీ పిటీషన్ ఫైల్ చేశారు. దర్యాప్తు లో ఉన్న ఈ కేసులో కొన్ని కీలక విషయాలు వెల్లడవటం వలన పోలీసులు జానీ బెయిల్ రద్దు కోసం పిటీషన్ వేశారు.
దర్యాప్తులో ఉన్న ఈ కేసులో పోలీసులు అనేక విషయాలు నిర్ధారించారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ పలు సందర్భాల్లో, అవుట్ డోర్ షూటింగ్స్ లో లైంగిక వేధింపులకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈవెంట్ల పేరుతో బాధితురాలిని అవుట్ డోర్ కి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. బాధితురాలు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకోవటంతో పాటు, పోలీసులు కూడా కొన్ని ఆధారాలను సేకరించినట్లు సమాచారం. దీనితో జానీ మాస్టర్ ని మళ్ళీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్న జానీ ఎవరు ఛాన్స్ ఇవ్వటం లేదని వాపోయాడు. ఇలాంటి టైం లో చరణ్ పిలిచి తన నెక్స్ట్ మూవీలో అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసు కారణం గానే పుష్ప 2 ఛాన్స్ మిస్ అవటం, నేషనల్ అవార్డు రద్దు, కొరియోగ్రాఫర్స్ అసోషియేషన్ నుంచి సస్పెన్షన్ లాంటివి ఎదుర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ అయితే జానీ కెరియర్ ఇక ముగిసినట్టే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.